బర్డ్స్ పాఠశాలలో ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాము.
ఇందులో భాగంగా ఎచ్.ఎమ్ సింధూర మేడమ్ ను విధ్యార్థులచేత స్టేజి దగ్గరికి స్వాగతం పలికాము, అనంతరము, లేడిస్ స్టాప్ అందరూ ఎచ్ ఎమ్ మేడమ్ ను శాలువా, పూలదండ, బహుమతులతో సన్మానించాము.
తర్వాత ఒక విధ్యార్థి మహిళా దినోత్సవం గురించి పాట పాడారు. తర్వాత విధ్యార్థులు డాక్టర్, నర్స్, పేషంట్ వేషాధారణలతో సందేశమిచ్చే కూతురు స్కిట్ ను ప్రదర్శించారు.
తెలుగు పండిట్ బర్నబాస్ గారు మహిళా దినోత్సవం గురించి అమూల్యమైన ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. తర్వాత లేడిస్ స్టాప్ అంత్యాక్షరి కార్యక్రమంలో పాల్గొన్నారు. చక్కటి పాటలు పాడడం జరిగింది.