BIRDS Widows Day 2021
వితంతు మహిళలు ఆత్మగౌరవంతో బతకాలి : బర్డ్స్ డైరెక్టర్ పాల్ రాజ రావ్
చాగలమర్రి (ముత్యాలపాడు) :-నిరుపేద వితంతు, వృద్ధ మహిళలు,సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ఆశయమని బర్డ్స్ డైరెక్టర్ పాల్ రాజారావు పేర్కొన్నారు.
మండల పరిధిలోని ముత్యాలపాడు గ్రామంలో గల బర్డ్స్ క్యాంపస్ లోని సమావేశ భవనంలో బుధవారం 105 మంది పేద వితంతువృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాల్ రాజా రావు మాట్లాడుతూ కుటుంబాములో పోషించే వారిని కోల్పోయిన వితంతు మరియు వయసు మీద పడి వృద్దాప్యం తో కష్టపడే శక్తి సన్నగిల్లి కుటుంబ సభ్యుల పై ఆధారపడి జీవిస్తున్న పేద వృద్ధ మహిళలను ఎంపిక చేసి వారికి హాన్న పుట్టినరోజు సందర్భంగా చీరలు పంపిణీ చేయడం గత 7 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న విషయం విధితమే ని ఈ సందర్భంగా పాల్ రాజారావు సూచించారు
సమాజంలోని ప్రతి అక్కా చెల్లెమ్మలు అయినటువంటి ప్రతిఒక్క మహిళ ఆత్మ గౌరవంతో బ్రతకాలని పిలుపునిచ్చారు.
బర్డ్స్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కుల, మతాలకతీతంగా అభాగ్యుల ను అనాదలను చేరదీసి వారిలోనూ ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న సేవా భావం గ్రామీణ ప్రాంతాల అభాగ్యుల కు అభయహస్తం గా పలువురు సమావేశంలో అభిప్రాయం వ్యక్టం చేయటం గమనార్హం
హన్న జన్మదినం సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అయన చేసిన సామాజిక సేవలను పాల్ రాజారావు వివరించారు
ఈ కార్యక్రమంలోబర్డ్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి సింధూర, బర్డ్స్ కోఆర్డినేటర్లు బాలకృష్ణ, భాస్కర్, చెన్నయ్య, వైస్ ప్రిన్సిపాల్ కిషోర్, బర్డ్స్ ఆరోగ్య కార్యకర్త,లు వృద్ధులు, వితంతువులు, పాల్గొన్నారు.